Pawan Kalyan: వారానికి ఒక్కసారైనా చేనేత వస్త్రాలు ధరించండి!

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందేశం ఇచ్చారు.

Update: 2025-08-07 14:33 GMT

Pawan Kalyan: వారానికి ఒక్కసారైనా చేనేత వస్త్రాలు ధరించండి!

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందేశం ఇచ్చారు.

వారానికి ఒక్కసారి చేనేత వస్త్రాలను ధరించమని యువతకు పిలుపునిచ్చారు. చేనేత రంగంపై ఆధారపడ్డవారికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు.

చేనేత మన దేశ సంస్కృతి, స్వాతంత్ర్య ఉద్యమ భావనలకు ప్రతీకగా నిలిచిందని పేర్కొంటూ, ఈ రంగాన్ని ఉద్ధరించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

కేబినెట్ సమావేశంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలను పవన్ తెలిపారు:

నేత మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్

సొసైటీల ద్వారా ఆప్కో కొనుగోళ్లపై జీఎస్టీలో 5% రాయితీ

త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు

చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంచేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని, యువత భాగస్వామ్యం ద్వారా ఈ రంగాన్ని బలోపేతం చేయవచ్చని పిలుపునిచ్చారు.




Tags:    

Similar News