అసెంబ్లీలో వైసీపీ నేతల తీరు చూస్తోంటే నాకేం గుర్తుకొస్తుందంటే - పవన్ కల్యాణ్
Pawan Kalyan speech in AP Assembly: ఏపీ శాసన సభలో గవర్నర్ స్పీచ్‌పై అభ్యంతరం వ్యక్తంచేస్తూ వైసీపీ శాసన సభ్యులు సభలో ఆందోళన వ్యక్తంచేశారు. సభలో వైసీపీ నేతల తీరును తప్పుపడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు వ్యాఖ్యలు చేశారు. శాసన సభ్యులు ప్రజలకు ఆదర్శంగా నిలవాలి కానీ ఇలా ఉండకూడదన్నారు. గొడవలు, బూతులకు వైసీపీ కేరాఫ్ అడ్రస్ అయిపోయిందన్నారు. గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు వైసీపీ సభ్యులు అలా ప్రవర్తించడం సబబేనా అని ఆయన ప్రశ్నించారు.
గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ జ్వరంతో బాధపడుతున్నప్పటికీ ఆయన ప్రసంగాన్ని పూర్తి చేసినందుకు ధన్యవాదాలు చెబుతున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. వైసీపీ సభ్యులను ఇబ్బంది పెట్టకూడదని, సభలో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు తమకు దిశానిర్దేశం చేస్తుంటారని గుర్తుచేసుకున్నారు. కానీ వైసీపీ నేతల తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉందన్నారు. గవర్నర్ ను వైసీపీ నేతల అవమానించడంలో తమ తప్పేమీ లేకపోయినప్పటికీ ప్రభుత్వం తరపున వారికి క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.
ఇక అభివృద్ధి విషయంలోనూ ఏపీలో తమ కూటమి ప్రభుత్వం ముందంజలో దూసుకుపోతోందన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అభివృద్ధి కంటే తమ కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లో చేసిన అభివృద్ధి ఎక్కువగా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం.