Pawan Kalyan: సినిమా హీరోలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Pawan Kalyan: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలిసిన పవన్ కల్యాణ్
Pawan Kalyan: సినిమా హీరోలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Pawan Kalyan: బెంగళూరులో కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రేతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. చిత్తూరు జిల్లా పరిధిలో, పార్వతీపురం ప్రాంతంలో ఏనుగులు ఊళ్ల మీదకు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి. ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు అవసరమవుతాయి. కుంకీ ఏనుగులు కర్ణాటక దగ్గర ఉన్నాయి. కొన్ని కుంకీ ఏనుగులు ఏపీకి ఇచ్చేలా కర్ణాటక అటవీ శాఖ మంత్రితో పవన్ కల్యాణ్ చర్చలు జరిపారు. ఇక పర్యటనలో భాగంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యతో కూడా పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమా హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 40 సంవత్సరల క్రితం సినిమాల్లో హీరో అడవులను కాపాడే వాడని, కానీ ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడని వ్యాఖ్యానించారు.