పవన్ కల్యాణ్ వర్సెస్ ద్వారంపూడి.. పవన్ వ్యాఖ్యలకు ద్వారంపూడి కౌంటర్..

Pawan Kalyan vs Dwarampudi: ఇకపై ద్వారంపూడి ఆటలు సాగవు పవన్ జనసేన ఎవరి బాగుకోసం ద్వారంపూడి

Update: 2023-06-19 07:24 GMT

పవన్ కల్యాణ్ వర్సెస్ ద్వారంపూడి.. 

Pawan Kalyan vs Dwarampudi: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో భాగంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ అండ చూసుకొని రెచ్చిపోతున్న ద్వారంపూడి ఆటలు ఇకపై సాగనివ్వమన్నారు. ఈసారి ఎన్నికల్లో ద్వారంపూడిని గెలవనివ్వనంటూ సవాల్ చేశారు. తాను ఏపీకి వచ్చేశానని. మంగళగిరిలో ఉంటానని. ఎవరొస్తారో రండి చూసుకుందామని వార్నింగ్ ఇచ్చారు. సినిమా స్టైల్‌లో పవర్‌ ఫుల్ డైలాగులు, వార్నింగ్‌లతో వైసీపీ నాయకులను హెచ్చరించారు.

ఇటు పవన్ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే ద్వారంపూడి కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ఒక రాజకీయ వ్యభిచారి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు జనసేన ఎవరి బాగు కోసం. రాష్ట్రం కోసమా. చంద్రబాబు కోసమా అని ప్రశ్నించారు. జనసేన పార్టీ పెట్టినప్పుడు ఉన్నవాళ్లంతా ఇప్పుడు పవన్‌తో ఉన్నారా అని నిలదీశారు. తాను రెండు సార్లు పోటీ చేసి గెలిచానని. పవన్ రెండు చోట్లా ఓడిపోయాడంటూ ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ఆరోపించినట్లు తాను రౌడీని అయితే జనం తనను రెండు సార్లు ఎందుకు గెలిపిస్తారని ప్రశ్నించారు.

Tags:    

Similar News