ఏపీ సచివాలయంలో కరోనా కలకలం.. ఉద్యోగుల ఆందోళన..

Update: 2020-06-04 08:44 GMT

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా కలకలం రేగింది. ఏపీ సచివాలయంలో సాధారణ పరిపాలన శాఖలో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఒకటో బ్లాక్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉద్యోగి పనిచేస్తున్నాడు. ఉద్యోగికి కొవిడ్‌ నిర్ధారణ కావడంతో ఇతర ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వారం క్రితం వ్యవసాయ శాఖ ఉద్యోగికి కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ శాఖ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇదే తరహాలో సచివాలయంలో పనిచేసే ఇతర ఉద్యోగులకు కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 98 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం కేసులు 3377. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 71. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,273కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 1033 మంది చికిత్స పొందుతున్నారు.


Tags:    

Similar News