Nuzvid: జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సత్తా

స్థానిక ఆర్జీయూకేటీ నూజివీడు విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతి సంవత్సరం జరిగేటువంటి "సంకల్ప హెకతాన్"-2020 పోటీలలో ద్వితీయ స్థానం గెలుపొందారు.

Update: 2020-03-04 07:22 GMT

నూజివీడు: స్థానిక ఆర్జీయూకేటీ నూజివీడు విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతి సంవత్సరం జరిగేటువంటి "సంకల్ప హెకతాన్"-2020 పోటీలలో ద్వితీయ స్థానం గెలుపొందారు. "సంకల్ప సెమీకండక్టర్"హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ కంపెనీ కింద పనిచేసే ఒక విభాగం, వీరు ప్రతి సంవత్సరం "సంకల్ప హెకతాన్" పేరుతో జాతీయ స్థాయిలో వివిధ రంగాలలో పోటీలు నిర్వహిస్తున్నారు.

అందులో భాగంగా ఈ సంవత్సరం వ్యవసాయం, కాలుష్యం మరియు శక్తి నిర్వహణ అంశాలమీద పోటీలనూ కలకత్తాలోని ఆడమాస్ విశ్వవిద్యాలయం నందు ఫిబ్రవరి 28 2020 న "ఐ ఓ టి బేసెడ్ సొల్యూషన్ ఫర్ ఇండియన్ ఎకోసిస్టం"అనే అంశం మీద నిర్వహించారు.

ఈ పోటీలకు ముందుగా వివిధ విశ్వవిద్యాలయాల నుండి 138 జట్లు హాజరుకాగా చివరి రౌండ్ కి 12 జట్లు ఎంచుకోబడ్డాయి, అందులో మూడు జట్లు ఆర్జీయూకేటీ నూజివీడు నుండి కావడం విశేషం ఆర్జీయూకేటీ నూజివీడు ఈ-3 ఈసీఈ శాఖకు చెందిన ఆర్.సుధీర్,ఈ.నవీన్ కుమార్,ఏ.రవితేజ ప్రాతినిధ్యం వహించిన "మైండ్ బెండర్స్" అనే జట్టు ద్వితీయ స్థానంలో 50,000/-రూపాయలు గెలుపొందడం,ఆ సంస్థలో ఉద్యోగం పొందడం కొసమెరుపుగా నిలిచింది.


Tags:    

Similar News