Kadapa: జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు
జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని కలెక్టర్ హరి కిరణ్ పేర్కొన్నారు.
కడప: జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని కలెక్టర్ హరి కిరణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలోఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి ఇంటి వద్దకు గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా సమాచారం సేకరిస్తున్నామని,గల్ఫ్ దేశాల నుండి వచ్చిన వారి వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని తెలిపారు.
ఇప్పటి వరకు 2000 మంది వ్యక్తులు బయటి దేశాల నుండి వచ్చారని,వారిని 14 రోజుల పాటు ఇళ్లలోనే ఉండాలని, బయటకు ఎట్టి పరిస్థితుల్లో రాకూడదని పేర్కొన్నారు.వారి ఆరోగ్య పరిస్థితి బాగుంటే పర్వాలేదు.. లేని పక్షంలో వెంటనే ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో జరిగే జాతరలు, తిరుణాల లు తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని సూచించారు.తప్పనిసరి అయితే పరిమిత ప్రజలతో చేసుకోవాలని తెలిపారు.