ఇది కోర్టు ధిక్కరణే.. ఎస్ఈసీ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ ఏజీ వ్యాఖ్యలకు నిమ్మగడ్డ కౌంటర్..

ఏపీ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్‌ మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ రోజురోజుకు ముదురుతోంది.

Update: 2020-05-31 14:16 GMT
Nimmagadda ramesh kumar(file photo)

ఏపీ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్‌ మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ రోజురోజుకు ముదురుతోంది. ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టేసింది. తనను పూర్తికాలం పదవిలో కొనసాగేలా..ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిందని నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ తెలిపారు. ఎస్‌ఈసీ వ్యవహారంలో ఏపీ అడ్వొకేట్‌ జనరల్‌ సుబ్రమణ్యం శ్రీరాం చేసిన వ్యాఖ్యలపై నిమ్మగడ్డ స్పందించారు. ఓ ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయకపోవడం సరికాదన్నారు. కోర్టు తీర్పు, ఆదేశాలను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందన్నారు. ప్రభుత్వం వైఖరి అసమంజసం, అవమానకరంగా ఉందని ఆక్షేపించారు. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని, స్వతంత్రతను ప్రభుత్వం అంగీకరించడం లేదని అభిప్రాయపడ్డారు.

వచ్చే ఏడాది మార్చి 31 వరకు తన పదవీకాలం ఉందని నిమ్మగడ్డ తన ప్రకటనలో తెలిపారు..ఈ సంధర్భంగా.. 'ఏపీ ప్రభుత్వం నన్ను తొలగించలేదు. ప్రభుత్వం తెచ్చిన జీవో వల్ల నా పదవీకాలం ముందే ముగిసింది. ప్రభుత్వం తెచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. జస్టిస్ (రిటైర్డ్) కనగరాజ్ నియామకంపై ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కూడా కోర్టు కొట్టివేసింది. ఎస్ఈసీ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. ఆ సంస్థ చీఫ్ పదవి ఖాళీగా ఉండకూడదు. అందుకే హైకోర్టు తీర్పు, ఆదేశాల ప్రకారం నేను బాధ్యతలు తీసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శికి సమాచారం ఇచ్చా. ఆ మేరకు కార్యదర్శి సర్క్యులర్ ఇచ్చారు. నా పదవీకాలం 2021 మార్చి 31 పూర్తయ్యే వరకు నన్నే ఎస్ఈసీగా కొనసాగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీలోని 318 పేరాలో స్పష్టంగా చెప్పింది. నిమ్మగడ్డ ప్రకటనలో పేర్కోన్నారు. 

Tags:    

Similar News