Neelam Madhu: కాంగ్రెస్ పార్టీ నన్ను నమ్మించి గొంతు కోసింది
Neelam Madhu: ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తా
Neelam Madhu: కాంగ్రెస్ పార్టీ నన్ను నమ్మించి గొంతు కోసింది
Neelam Madhu: దామోదర రాజనరసింహ పై నీలం మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోల్ లో గెలవలేని రాజ నర్సింహ.. పక్క నియోజకవర్గాల్లో వేలు పెడుతున్నాడని మధు ఆరోపించారు. వరుసగా రెండు సార్లు ఓడిపోయిన రాజనర్సింహను ఆందోల్ లో మరోసారి ఓడిస్తామన్నారు. ఆందోల్ లో తానే స్వయంగా ప్రచారం చేస్తాని... దామోదర ఎట్లా గెలుస్తారో చూస్తానని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ తనను నమ్మించి తడిబట్టతో గొంతు కోసిందని.. బీఅర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా తనను మోసం చేశాయని చెప్పాచరు. పటాన్ చెరు బరిలో ఉంటానని.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తానని నీలం మధు ధీమా వ్యక్తం చేశారు.