Tirupati By-Election: తిరుపతి ఉప ఎన్నికలో గాజు గ్లాసు గుర్తు గలాటా
Tirupati By-Election: గాజు గ్లాసు జనసేన గుర్తు కాదా..? తిరుపతి ఉప ఎన్నికలో ఇప్పుడు ఇదే అనుమానం వస్తోంది.
Tirupati By-Election: తిరుపతి ఉప ఎన్నికలో గాజు గ్లాసు గుర్తు గలాటా
Tirupati By-Election: గాజు గ్లాసు జనసేన గుర్తు కాదా..? తిరుపతి ఉప ఎన్నికలో ఇప్పుడు ఇదే అనుమానం వస్తోంది. నవతరం పార్టీ అభ్యర్థి గోదా రమేశ్‌కుమార్‌కు గాజు గ్లాసు గుర్తు కేటాయించింది ఈసీ. ఇక్కడ జనసేన బరిలో లేదు బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తోంది. దీంతో ఓటర్లు గాజుగ్లాసు గుర్తు వచ్చిన అభ్యర్థి జనసేన అనుకుని ఓట్లు వేసే ప్రమాదముంది. ఇలా జరిగితే బీజేపీ ఓట్లకు గండి పడుతుంది. బీజేపీ వర్గాల్లో మొదలైన ఆందోళన ఢిల్లీకి చేరింది. కమలం పార్టీ, జనసేన నాయకులు ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని కలిసి పరిస్థితి వివరించారు. నవతరం పార్టీకి కేటాయించిన గాజు గ్లాసు గుర్తును రద్దు చేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.