సీఎం జగన్‌ ప్రకటనతో క్లారిటీ వచ్చింది: బీజేపీ ఎంపీ జీవీఎల్

Update: 2019-12-18 09:28 GMT
జీవీఎల్

ఏపీ రాజధానిపై సీఎం జగన్‌ ప్రకటనతో క్లారిటీ వచ్చిందన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్‌. అమరావతిని కేవలం అసెంబ్లీ సమావేశాలకు మాత్రమే పరిమితం చేశారని విమర్శించారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుకు బీజేపీ కూడా మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. రాజకీయ, సామాజిక కోణంలో రాజధానిపై నిర్ణయం తీసుకోకూడదని సూచించారు. భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాడ్ చేశారు. ప్రజలను అయోమయానికి గురిచేయకుండా స్పష్టత ఇవ్వాలని సామాన్య రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు రావొచ్చని జగన్ ఇచ్చిన సంకేతాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతన్నాయి. ఏపీకి మూడు రాజధానులంటూ జగన్‌ చేసిన ప్రకటనను కొందరు స్వాగతిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రులు మారితే రాజధానిని మారుస్తారా అంటూ అమరావతి ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News