రాష్ట్ర ప్రజల కోసం ముందు జాగ్రత్తతో సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. నో ప్లాస్టిక్ న్యూ నగరి చివరిరోజు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె కిలో ప్లాస్టిక్ వ్యర్థాలకు కిలో బియ్యం అందించారు. ఆ తర్వాత ఓం శక్తి ఆలయం సర్కిల్ దగ్గర వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చినట్లు రోజా వివరించారు.