Andhra Pradesh: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి
* కడప జిల్లా బద్వేల్‌కు చెందిన గోవిందరెడ్డికి రెన్యూవల్ * స్థానిక సంస్థల కోటాలో తూ.గో - అనంతబాబు
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి(ఫైల్ ఫోటో)
Andhra Pradesh: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తయింది. కడప జిల్లా బద్వేల్ కు చెందిన గోవిందరెడ్డికి మరోసారి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల కోటాలో తూర్పుగోదావరి జల్లాకు చెందిన అనంతబాబు, విశాఖకు చెందిన వంశీకృష్ణ యాదవ్, విజయనగరంకి చెందిన ఇందుకురి రఘురాజును, కృష్ణా జిల్లాకు చెందిన తలసిల రఘురాంకు అవకాశం కల్పించారు.