Minister Roja: చిత్తూరు జిల్లాలో పర్యటించిన మంత్రి రోజా

Minister Roja: గన్ సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు

Update: 2023-11-22 04:42 GMT

Minister Roja: చిత్తూరు జిల్లాలో పర్యటించిన మంత్రి రోజా

Minister Roja: చిత్తూరు జిల్లా విజయపురం మండలం కలియంబాకం సచివాలయం పరిధిలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఏపీ మంత్రి రోజా పాల్గొన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో తమ జీవితాల్లో వెలుగులు నిండాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని రోజా తెలిపారు. గతంలో సంక్షేమ పథకాల కోసం జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగేవాళ్ళమని.. ప్రస్తుతం అడగకుండానే, జగన్ అన్ని చేస్తున్నారని అన్నారు. మంచి మనసున్న జగనన్న చల్లగా వుండాలని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News