స్పీకర్‌పై ప్రతిపక్ష చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్చ జరగాల్సిందేనన్నారు మంత్రి అనిల్. చంద్రబాబుకు ఇంత సీనియారిటీ ఉండి ఏం లాభమన్నారు. చంద్రబాబు ఇలానే ప్రవర్తిస్తే ఆయన వద్ద ఉన్న 23 మంది ఎమ్మెల్యేలు కూడా ఉండరని మంత్రి అనిల్ అన్నారు.
అసెంబ్లీలో స్పీకర్ స్థానానికి కూడా గౌరవం ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీ ఉందని, ఆ పార్టీ నాయకుడే నోరు జారితే, ఎమ్మెల్యేలు ఎలా సంయమనంతో ఉంటారని స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో శాసనసభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. స్పీకర్ ను వేలు పెట్టి చూపిస్తూ, విమర్శించడం దారుణమని అన్నారు అంబటి రాంబాబు. స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచిన ప్రతిపక్ష నేత చంద్రబాబుపై సభలో చర్చ జరగాలని, సభలో మర్యాద పాటించని వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు.