ఎస్.రాయవరం: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపిటిఎఫ్) విశాఖపట్నం జిల్లా శాఖ, ఎస్ రాయవరం మండల శాఖ ఆధ్వర్యంలో కోవిడ్ -19 విధులు నిర్వహిస్తున్న మెడికల్ సిబ్బందికి, పోలీసులకు సోమవారం మాస్కులను, గ్లౌజులను, సబ్బులను, శానిటైజర్లను పంపిణీ చేశారు. హైవే ను ఆనుకుని ఉన్న పాయకరావుపేట, గొడిచెర్ల , నక్కపల్లి , పెనుగొల్లు తదితర ప్రభుత్వాసుపత్రులలో సిబ్బందికి, పోలీసు వారికి వీటిని అందజేశారు. ఈ సందర్భంగా పెనుగొల్లు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారిణి డా.కె.అనూష మాట్లాడుతూ... ప్రజలందరూ ఈ కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే సామాజిక దూరం పాటిస్తూ, పరిశుభ్రంగా ఉండాలని అన్నారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బందికి ఈసామాగ్రిని అందజేస్తున్న ఏపిటిఎఫ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు కొటాన శ్రీనివాసు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, పెందుర్తి మండల శాఖ బాధ్యులు శ్యామ్ కుమార్, రాష్ట్ర కౌన్సిలర్ బి.శ్రీనివాసరావు, మరియు ఎస్ రాయవరం మండల గౌరవ అధ్యక్షులు బి. జోగినాయుడు , కె .కె. ఎల్. ఎన్.ధర్మారావు , ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాసరావు , అధ్యక్షులు బి.సునీల్ తదితరులు పాల్గొన్నారు.