Bheemunipatnam: సెల్ టవర్ తొలగించాలని స్థానికులు ఆందోళన
నివాసాల మధ్య సెల్ టవర్ ఉందనీ దానిని తొలగించాలని స్థానిక జోగావారివీధి నివాసితులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈసెల్ టవర్ ను 2006లో 15 ఏళ్ల లీజుకు ఒప్పందం కుదుర్చకుని పెట్టారనీ అన్నారు.
భీమునిపట్నం: నివాసాల మధ్య సెల్ టవర్ ఉందనీ దానిని తొలగించాలని స్థానిక జోగావారివీధి నివాసితులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈసెల్ టవర్ ను 2006లో 15 ఏళ్ల లీజుకు ఒప్పందం కుదుర్చకుని పెట్టారనీ అన్నారు. అయితే మొదట టాటా ఇండికం పేరుతో పెట్టారనీ, ఇటీవల జియో వచ్చిన నుంచి దీని ద్వారా కనెక్షన్ లు ఇచ్చారనీ, అంతేకాకుండా ఎయిర్ టెల్ 4జి కూడా ఈ టవర్ నుంచే కనెక్షన్ ఇచ్చారనీ తెలిపారు.
దాంతో ఈ సెల్ టవర్ నుంచి రేడియేషన్ వచ్చి ఇక్కడ నివసించే వారు అనారోగ్యానికి గురవుతున్నారని, అంతేకాకుండా ఇద్దరు అనారోగ్యంతో చనిపోయారనీ తెలిపారు. చిన్న పిల్లల ఆరోగ్యం కూడా క్షీణీస్తోందనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఒక సంవత్సరం లీజు ఉన్నప్పటికీ ఈ సెల్ టవర్ ను తీసివేయాలనీ వారు కోరారు.