10 పదేళ్ల తర్వాత మాకు న్యాయం జరిగింది - కఠారి బంధువులు

కోర్ట్ తీర్పుపై కఠారి అనురాధ బంధువుల హర్షం చిత్తూరు కోర్ట్‌ తీర్పును హైకోర్ట్‌లో సవాల్ చేస్తాం- దోషుల తరపు న్యాయవాది మా వాదనలు హైకోర్ట్‌లో వినిపిస్తాం - దోషుల తరపు న్యాయవాది

Update: 2025-10-31 10:04 GMT

పదేళ్ల తర్వాత న్యాయం జరిగింది: కఠారి దంపతుల హత్య కేసులో తీర్పుపై బంధువుల హర్షం

పదేళ్ల తర్వాత తమకు న్యాయం జరిగిందని కఠారి అనురాధ-మోహన్ దంపతుల కుమార్తె తెలిపారు. చిత్తూరు కోర్ట్‌ తీర్పుపై అనురాధ బంధువులు హర్షం వ్యక్తం చేశారు.


కఠారి అనురాధ, మోహన్ జెంట హత్యల కేసులో సుదీర్ఘ వాదనలు జరిగాయని కేసును వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ శైలజ తెలిపారు. మొత్తం 130 మంది సాక్షులు, 23 మంది నిందితులతో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారన్నారు. అందులో 57 మంది సాక్షులని ప్రాసిక్యూషన్ విచారించిందని, 23 మంది నిందితులలో చివరిగా ఐదుగురుని దోషులుగా కోర్ట్ తేల్చిందని వెల్లడించారు. కోర్టు ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు చేసిందని స్పష్టం చేశారు.


చిత్తూరు మాజీ మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో చిత్తూరు కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని ప్రధాన నిందితుడు చింటూ తరపు న్యాయవాది విజయ్ చంద్రారెడ్డి తెలిపారు. ఇలాంటి కేసుల్లో సాధారణంగా ఉరిశిక్ష పడే అవకాశం లేదని... తమ వాదనలను పరిగణలోకి తీసుకున్నప్పటికీ జడ్జి తీర్పు ఇచ్చారని చెప్పారు. తొందరలోనే హైకోర్టులో తమ వాదనలో వినిపిస్తామని... న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఉందని లాయర్ విజయ్ చంద్రారెడ్డి తెలిపారు. 

Tags:    

Similar News