జగనన్న వసతి దీవెన తొలి విడత పంపిణీ.. తల్లుల ఖాతాల్లోకి నిధులు

Jagananna Vasathi Deevena: 10లక్షల 89వేల మంది తల్లుల ఎకౌంట్లలోకి నేరుగా నిధులు జమ చేశారు.

Update: 2021-04-28 08:32 GMT

సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

Jagananna Vasathi Deevena: పేదరికం కారణంగా ఏ విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదన్న ఉద్దేశంతోనే జగనన్న వసతి దీవెన పథకానికి శ్రీకారం చుట్టామని అన్నారు సీఎం జగన్‌. 10లక్షల 89వేల మంది తల్లుల ఎకౌంట్లలోకి నేరుగా నిధులు జమ చేశారు. పాలిటెక్నిక్‌ విద్యార్థులకు 15వేలు, డిగ్రీ, మెడిసిన్, ఇంజినీరింగ్‌ చదివే విద్యార్థులకు 20వేలు చొప్పున ప్రతి ఏడాది రెండు వాయిదాల్లో జగనన్న వసతి దీవెన లబ్దిదారులకు అందనుంది.

పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులపాలు కావొద్దన్న జగన్.. కుటుంబంలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు.

Tags:    

Similar News