CM Jagan: జులై 1 నుంచి జగనన్న సురక్ష కార్యక్రమం
CM Jagan: ప్రతి ఇంటికి వెళ్లాలని నేతలకు జగన్ ఆదేశం
CM Jagan: జులై 1 నుంచి జగనన్న సురక్ష కార్యక్రమం
CM Jagan: జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లాలని నేతలకు సీఎం జగన్ ఆదేశించారు. ఇంకా ఏ ఏ పథకాలు ప్రజలకు అందలేదో తెలుసుకోవాలని ఆదేశించారు. జగన్ అధ్యక్షతన గడప గడపకు మన ప్రభుత్వంపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు ఆఫీస్ లో జరిగిన సమావేశానికి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లు హాజరయ్యారు.
జులై 1వ తేదీ నుంచి జరిగే జగనన్న సురక్ష కార్యక్రమంపై సమావేశంలో చర్చించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా జగనన్న సురక్ష కార్యక్రమం తీసుకువస్తున్నారు. దాదాపు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది.