నడిరోడ్డుపై దారుణం.. బట్టలు చించి నర్సుపై దాడి చేసిన హిజ్రాలు
నెల్లూరు జిల్లా కందుకూరులో హిజ్రాలు రెచ్చిపోయారు. మద్యం, గంజాయి మత్తులో ఉన్న హిజ్రాలు అరాచకాలకు పాల్పడుతున్నారు.
నెల్లూరు జిల్లా కందుకూరులో హిజ్రాలు రెచ్చిపోయారు. మద్యం, గంజాయి మత్తులో ఉన్న హిజ్రాలు అరాచకాలకు పాల్పడుతున్నారు. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రజా వైద్యశాలలో హిజ్రాలు నానా హంగామా చేశారు. అడిగినంత మామూళ్లు ఇవ్వలేదని.. ఆస్పత్రిలో పనిచేసే నర్సుపై విచక్షణారహితంగా దాడి చేశారు.
నర్సు జుట్టుపట్టుకుని.. ఈడ్చుకొచ్చి.. అకృత్యాలకు పాల్పడ్డారు. అక్కడే ఉన్న డాక్టర్ వారిని వారించే ప్రయత్నం చేయగా... డాక్టర్ ముందు నగ్నంగా అసభ్యంగా ప్రవర్తించారు. రోజురోజుకు హిజ్రాల అరాచకాలతో స్థానికులు భయాందోళనలోకు గురవుతున్నారు. పోలీసులు తక్షణమే చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.