Weather Update: తెలుగురాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఎల్లుండి నాటికి వాయుగుండంగా బలపడనుంది. ఇది సెప్టెంబర్ 27వ తేదీ నాటికి ఉత్తరాంధ్ర-ఒడిశా తీర ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల కోస్తాంధ్ర, రాయలసీమ మరియు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.
తీర ప్రాంత ప్రజలు మరియు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలో వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, ప్రభుత్వ అధికారులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేసింది.