Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఆ క్రిమినల్ కేసు కొట్టేసిన కోర్టు
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేస్తూ గుంటూరు స్పెషల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఆ క్రిమినల్ కేసు కొట్టేసిన కోర్టు
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేస్తూ గుంటూరు స్పెషల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పవన్ కళ్యాణ్ గతేడాది జులై 9న ఏలూరులో నిర్వహించిన వారాహి సభలో వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలొచ్చాయి. వాలంటీర్లు సమాజంలో అసాంఘిక శక్తులుగా మారారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారంటూ కడప, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన కొందరు వాలంటీర్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదులను పరిశీలించిన అప్పటి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, జనసేనాని పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు లేఖ రాశారు. నేరుగా ప్రభుత్వమే ఆదేశించడంతో గుంటూరు జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుంటూరు కోర్టులో ఫిర్యాదు చేశారు. పవన్‌పై 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదయింది.
ఈ కేసుపై పవన్ కళ్యాణ్ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు గుంటూరు కోర్టు తాజా విచారణలో తాము పవన్‌పై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని వాలంటీర్లు తెలిపారు. ఆ సంతకాలు తమవి కాదని చెప్పారు. దీంతో కేసును కొట్టివేస్తూ గుంటూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శరత్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు.