Vizag Gas Leak: విశాఖలో మరోసారి గ్యాస్ కలకలం.. సాల్వెంట్ పరిశ్రమలో ఒక్కసారే ఎగిసిన మంటలు

Vizag Gas Leak: విశాఖ మరోసారి ఉలిక్కి పడిందనే చెప్పాలి. వరుస గ్యాస్ ఘటనలతో హడలి పోతున్న జనానికి పరవాడ ఫార్మా సిటీలో ఒక పరిశ్రమలో ఒకేసారి మంటలు ఎగిసి పడ్డాయి.

Update: 2020-07-14 01:45 GMT
Vizag Gas Leak

♦ విశాఖలో మరోసారి గ్యాస్ కలకలం..

♦ సాల్వెంట్ పరిశ్రమలో ఒక్కసారే ఎగిసిన మంటలు.

♦ ముగ్గురి పరిస్థితి విషమం.

Vizag Gas Leak: విశాఖ మరోసారి ఉలిక్కి పడిందనే చెప్పాలి. వరుస గ్యాస్ లీక్ ఘటనలతో హడలి పోతున్న జనానికి పరవాడ ఫార్మా సిటీలో ఒక పరిశ్రమలో ఒకేసారి మంటలు ఎగిసి పడటంతో విశాఖ వాసులంతా ఉలిక్కి పడ్డారు. మరోసారి ఎక్కడకు పరుగులు తీయాలిరా బాబూ అంటూ గగ్గోలు పెట్టారు. అయితే అదే సమయంలో భారీగా వర్షం కురుస్తుండటంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనలో ముగ్గురు గాయపడినట్టు తెలుస్తోంది. ఘటన అర్ధరాత్రి జరగడంతో పూర్తిస్థాయి సమాచారం రాలేదు.

విశాఖ పరవాడ ఫార్మా సిటీలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. రాంకీ కోస్టల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టు (సీఈటీపీ) సాల్వెంట్‌ పరిశ్రమలో సోమవారం రాత్రి 10:20 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరికి య్యాయని, మిగతా వారంతా క్షేమంగా ఉన్నారని జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్, పోలీసు కమిషనర్‌ ఆర్‌కే మీనా తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. విశాఖ సాల్వెంట్‌ కంపెనీ ఫార్మా కంపెనీ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను శుద్ధి చేసి తిరిగి ఫార్మా కంపెనీలకు విక్రయిస్తుంటుంది. వ్యర్థాలను శుద్ధి చేసే క్రమంలో కంపెనీలో ఉన్న ఐదు కాలమ్‌లలో ఒక కాలమ్‌లో పేలుడు జరిగి, మంటలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో కెమిస్టులు మల్లేష్‌ (42), మనోజ్, శ్రీనివాస్, సెక్యూరిటీ గార్డు చిన్నారావు మాత్రమే లోపల ఉన్నారు.

పేలుడుకు మల్లేష్‌కు గాయాలయ్యాయి. మిగతా వారంతా సురక్షితంగా బయటకు వచ్చేశారు. మల్లేష్‌ను గాజువాకలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం సంఘటన స్థలానికి చేరుకుంది. అదే సమయంలో కుండపోత వర్షం కురవడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందలేదు. అగ్నిమాపక శాఖకు చెందిన 5 ఫైర్‌ ఇంజన్లు, రాంకీ కంపెనీకి చెందిన మూడు ఫైరింజన్లు రెండున్నర గంటల్లో మంటలను అదుపు చేశాయి. సంఘటన గురించి తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని, సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి స్పందించారు. అధికారులను అప్రమత్తం చేశారు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్, విశాఖ ఆర్డీవో కిషోర్‌ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

Full View


Tags:    

Similar News