ఏపీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు
ఐదేళ్లలో 99 శాతం హామీలు అమలు చేశామని, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాం.
ఏపీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు
ఏపీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓటమిపై వైసీపీ పార్టీలో సుదీర్ఘంగా చర్చ జరగాలన్నారు. అడగకుండానే అన్నీ ఇచ్చినా..ఎందుకు ప్రజల ఆదరణ లభించ లేదో తేల్చుకోవాలన్నారు. పథకాల పంపిణికి వాలంటీర్ లాంటి వ్యవస్థలను ప్రవేశ పెట్టినా..ఎందుకు గెలవలేకపోయామో సమాధానం వెతుక్కోవాలన్నారు గుడివాడ అమర్నాథ్. ఐదేళ్లలో 99 శాతం హామీలు అమలు చేశామని, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాం. .ఇంకా ప్రజలు ఏమి కోరుకున్నారో తెలుసుకోలేకపోయామని గుడివాడ అమర్ నాథ్ అన్నారు. ఫలితాలు ఆశ్చర్యాన్ని కలగజేశాయని జగన్ అన్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులను అందరూ ఖండించాలన్నారు. వైసీపీ కార్యకర్తలను పట్టించు కోలేదని వాదన వస్తోందని.. అన్ని అంశాలపై సమీక్షించుకుంటామని గుడివాడ అమర్ నాథ్ స్పష్టం చేశారు.