Anti-Ship Missile: విశాఖలో క్షిపణి ప్రయోగం విజయవంతం

Anti-Ship Missile: స్వీయ సాంకేతిక పరిజ్ఞానంతో క్షిపణి తయారీ

Update: 2023-11-22 06:57 GMT

Anti-Ship Missile: విశాఖలో క్షిపణి ప్రయోగం విజయవంతం

Anti-Ship Missile: భారత్ అంతరిక్ష పరిశోధనల్లోనే కాక సొంతంగా అత్యంత శక్తివంతమైన క్షిపణులను తయారు చేసుకోవడంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటోంది. విశాఖ DRDO సహకారంతో సముద్ర జలాల్లో భారత్ నౌకా దళం చేపట్టిన క్షిపణి ప్రయోగం విజయవంతం అయింది. యాంటి షిప్ మిసైల్ ను నేవీ.. హెలికాప్టర్ ద్వారా ప్రయోగించింది. కాగా ఈ క్షిపణి ప్రయోగం విజయవంతం అయిందని విశాఖ నేవీ అధికారులు తెలిపారు. స్వీయ సాంకేతిక పరిజ్ఞానంతో భారత్ తొలిసారి రూపొందించిన ఈ క్షిపణి.. లక్ష్యాన్ని చేదించినట్లు వెల్లడించారు.

Tags:    

Similar News