గూడూరు జంక్షన్ సమీపంలో రైలులో మంటలు
*అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్.. మంటలార్పిన రైల్వే అధికారులు
గూడూరు జంక్షన్ సమీపంలో రైలులో మంటలు
Tirupati: తిరుపతి జిల్లా గూడూరు జంక్షన్ సమీపంలో నవజీన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. అహ్మదాబాద్ నుండి చెన్నై వైపు వెళ్తున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కిచెన్ బోగీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. గూడూరు రైల్వేస్టేషన్‌లో రైలు ఆపి మంటలు అదుపులోకి తెచ్చారు. రైల్వే అధికారుల అప్రమత్తతతో ప్రమాదం తప్పింది.