చిత్తూరు జిల్లా కురబలకోట తహశీల్దార్ కార్యాలయంలో ఓ రైతు వినూత్న నిరసన తెలుపుతున్నారు. ఎమ్మార్వో కార్యాలయంలో చాప దిండు వేసుకుని కృష్ణ అనే రైతు నిరసన తెలుపుతున్నారు. భూ సమస్య పరిష్కారం కోసం రెవిన్యూ సిబ్బంది ఆరు నెలలుగా తిప్పించుకుంటున్నారని ఆందోళనకారుడు చెబుతున్నారు. నిరసన విరమించమని రైతును రెవిన్యూ సిబ్బంది బుజ్జగిస్తున్నారు.