భాగస్వామ్య సదస్సు ద్వారా రూ.11.20 లక్షల కోట్ల పెట్టుబడులు

Update: 2025-12-17 07:03 GMT

అమరావతి: విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో రూ.11.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. ఎస్ఐపీబీల ద్వారా రూ. 8.50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆమోదించినట్లు తెలిపారు. వీటిని క్లియర్ చేయటంలో కలెక్టర్లు కూడా వేగంగా స్పందించాలన్నారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి వచ్చామని సీఎం చెప్పారు. పెట్టుబడులు పెట్టేవారికి అండగా ఉండి గౌరవించాలని, వేగంగా అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. డ్వాక్రా, మెప్మాను ఇంటిగ్రేట్ చేస్తున్నామని, పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు చేపడుతున్నామని, అందరికీ ఇళ్లు అందేలా చేస్తున్నామని వివరించారు. పీ4 ద్వారా పేదలకు చేయూత అందిస్తున్నామని, ప్రతిపక్షాలు కూడా దీనిని అర్ధం చేసుకోవాలని కోరారు.

ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి సుస్థిరమైన పాలన అందిస్తున్నారని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ప్రపంచం అంతా భారత్ గురించి ఆలోచన చేయకుండా ముందుకు వెళ్లటం లేదన్నారు. నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ ఐటీ, పెద్ద ఎత్తున స్థాపించిన కాలేజీల ద్వారా ఐటీ నిపుణులు వచ్చారని తెలిపారు. 

Tags:    

Similar News