గణపవరంలో రేపు గాంధేయ వాది మాజీమంత్రి మూర్తి రాజు శతజయంతి ఉత్సవాలు

మహాత్ముని అడుగుజాడల్లో నడిచి, రాష్ట్ర మంత్రిగా సేవలు అందించిన మూర్తిరాజు శతజయంతి ఉత్సవాలు పశ్చిమగోదావరి జిల్లా గణపవరంలో ఘనంగా నిర్వహించనున్నారు.

Update: 2019-12-15 10:42 GMT
Murthy Raju Centenary event Invitation

ప్రముఖ గాంధేయవాది, మాజీమంత్రి, మూర్తిరాజుగా సుప్రసిద్ధులైన చింతలపాటి సీతారాం చంద్ర వరప్రసాదం మూర్తిరాజు శతజయంతి ఉత్సవాలు రేపు (డిసెంబర్ 16)న నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా గణపవరంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలు రేపు ఉదయం గణపవరం డిగ్రీ కళాశాల వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చింతలపాటి సీతారాం చంద్ర వరప్రసాద మూర్తి రాజు శత జయంతి ఉత్సవ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. 

సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ విద్యార్థినీ, విద్యార్థులతో సాంస్కృతిక కార్య్కర్మాలు నిర్వహిస్తారు. అనంతరం ఏపీ గృహ   నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు అధ్యక్షతన సభా కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు, రైతు సంఘ నాయకులు మంతెన సూర్యనారాయణ రాజు, ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజులను సన్మానిస్తారు. కార్యక్రమమానికి పలువురు రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. 

Tags:    

Similar News