కాలేజీకి వెళ్లే బస్సు ఫీజు చెల్లించలేదనే మనస్థాపంతో.. ఫ్యాన్ కు ఉరేసుకొని విద్యార్థిని ఆత్మహత్య
* ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
కాలేజీకి వెళ్లే బస్సు ఫీజు చెల్లించలేదనే మనస్థాపంతో.. ఫ్యాన్ కు ఉరేసుకొని విద్యార్థిని ఆత్మహత్య
AP News: కాలేజీకి వెళ్లే బస్సు ఫీజు చెల్లించలేకపోవడంతో మనస్థాపం చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కృష్ణా జిల్లా గుడివాడ శ్రీరామాపురం కాలనీకి చెందిన బండారు లిఖిత నవ్య... విజయవాడ లింగయాస్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతుంది. బస్సు ఫీజు చెల్లించకపోవడంతో గత నాలుగు రోజులుగా ఇంటి వద్ద ఉంటున్న నవ్య, ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఉన్నత చదువులు, చదువుకుంటున్న కుమార్తె బలవన్మరణానికి పాల్పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.