Acid Attack: ఏలూరు యాసిడ్ దాడి ఘటన బాధితురాలు మృతి
Acid Attack: వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఫ్రాన్సిక
Acid Attack: ఏలూరు యాసిడ్ దాడి ఘటన బాధితురాలు మృతి
Acid Attack: ఏలూరులో యాసిడ్ దాడికి గురైన యువతి మృతి చెందింది. ఫ్రాన్సిక అనే యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. యడ్ల ఫ్రాన్సిక ఈ నెల 13 తేదీ రాత్రి ఆమె పనిచేస్తున్న డెంటల్ క్లినిక్ నుంచి స్కూటర్‌పై ఇంటికి వెళ్తుండగా ఇంటికి సమీపంలోనే కొందరు ఆమెపై యాసిడ్ పోశారు. ఈ కేసు తీవ్ర సంచలనం కలిగించింది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ప్రమాదకరమైన యాసిడ్‌ను తన బంగారుపని అవసరం నిమిత్తం అని చెప్పి కొనుగోలు చేసి తీసుకువచ్చిన వ్యక్తిని ఏలూరు దిశ పోలీసులు అరెస్టు చేశారు. ఆ యాసిడ్‌ను ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయిస్తున్న ఏలూరు గడియారస్తంభం ప్రాంతానికి చెందిన కిరాణాషాపు వ్యాపారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.