Payakaraopeta: తిమ్మాపురంలో టిడిపి ఎంపిటిసి అభ్యర్ధి పార్వతి ఇంటింటి ప్రచారం
ఎస్ రాయవరం : మండలంలోని తిమ్మాపురం గ్రామంలో ఎంపిటిసి టిడిపి అభ్యర్ది కర్రి పార్వతి శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పలువురు మహిళలు వెంటరాగా ఇంటింటికీ వెళ్ళి , ఆళ్ళలోని మహిళలకు బొట్టు పెట్టి ఓటును అభ్యర్ధించారు.
సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వంగలపూడి గోవిందు, ప్రగడ గోవిందు, కర్రి చందు, కర్రి రామకృష్ణ, ప్రసాదుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.