Rotary Club: పోలియో రహిత సమాజ నిర్మాణానికి రోటరీ క్లబ్ కృషి
* నిధుల సేకరణ కోసం క్రికెట్ టోర్నమెంట్.. రోటరీ ఇంటర్నేషనల్‌కు లక్షా పాతిక వేల డాలర్లు అందజేత
పోలియో రహిత సమాజ నిర్మాణానికి రోటరీ క్లబ్ కృషి
Rotary Club: పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం స్వచ్చంద సేవా సంస్థ రోటరీ క్లబ్ నిరంతరం కృషి చేస్తోంది. ఈ సంస్థలో భాగమైన రోటరీ 3020 ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అన్ని క్లబ్‌లు పోలియో నిర్మూలన కోసం నిధుల సేకరణ చేపట్టాయి. దీని కోసం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. మూడు రోజులు జరిగిన టోర్నమెంట్‌తో వచ్చిన లక్షా 25 వేల డాలర్లను రోటరీ ఇంటర్నేషనల్‌కు అందించినట్లు గవర్నర్ భాస్కర్ రామ్ తెలిపారు. రోటరీ క్లబ్ విశాఖపట్నం డైమండ్ గ్రూప్‌కి చెందిన హేమసుందర్ ఆల్‌రౌండ్ ఆటగాడిగా ముఖ్య అతిథి కపిల్‌దేవ్ సంతకం చేసిన బ్యాట్‌ను సొంతం చేసుకున్నారు.