Nellore: జనతా కర్ప్వూ తప్పక పాటిద్దాం: డా.ఉదయ్ శంకర్

ప్రధానమంత్రి నరేద్ర మోడీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూను అందరు ఈ ఆదివారం తప్పక పాటించాలని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఆర్. సుదర్శన రావు విజ్ఞప్తి చేశారు.

Update: 2020-03-21 14:23 GMT
Doctor Uday Shankar

వెంకటాచలం: ప్రధానమంత్రి నరేద్ర మోడీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూను అందరు ఈ ఆదివారం తప్పక పాటించాలని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఆర్. సుదర్శన రావు విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ స్వచ్చందంగా ముందుకు వచ్చి ఎవరికి వారే ఉదయం 7 గం. నుంచి రా. 9 గం. ఇంటివద్దే వుండాలని విశ్వవిద్యాలయ శ్రేణులను విద్యార్థులను అలాగే జిల్లా ప్రజలను కోరారు. కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది.

ఈ వైరస్ దాటికి ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఇతర దేశాలైన ఇటలీ, ఇరాన్ తగిన ముందస్తు పటిష్టమైన చర్యలు చేపట్టక పోవటం వలన అక్కడ అపార ప్రాణ నష్టం జరుగుతుందని అన్నారు. ఈ విషయములో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కట్టుదిట్ట చర్యలు చేపట్టాయని అందుకు వారిని మనమందరం మనస్ఫూర్తిగా అభినందించాలని అన్నారు. అలాగే వారి పిలుపు మేరకు ఈ వైరస్ ని అరికట్టేందుకు జనతా కర్ఫ్యూ ను పాటించి ఒక్కరోజు ఇళ్ళకే పరిమితమయ్యి కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా నిర్మూలించటానికి సహకరిద్దామని అన్నారు.

ఈ కరోనా వైరస్‌ని నియంత్రించడానికి క్షేత్ర స్థాయిలో అహర్నిశలు సేవాభావంతో 24 గంటలు పనిచేస్తోన్న వైద్యులు, నర్సులకు, ఇతర వైద్య ఆరోగ్య బృందానికి, స్వచ్ఛ కార్మికులు, పోలీస్‌ శాఖ వారికి అలాగే వారికి సరిగ్గా సాయంత్రం 5 గంటలకి మన ఇంటి గుమ్మాలలోకి వచ్చి కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలుపుదాం. ఈ సమావేశంలో ఎన్ఎస్ఎస్ సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం పాల్గొన్నారు.


Tags:    

Similar News