CM Jagan: మరింత ఆలస్యంకానున్న సీఎం జగన్ వైజాగ్ షిఫ్టింగ్

CM Jagan: డిసెంబర్‌లో విశాఖలో పాలన మొదలవుతుందన్న జగన్

Update: 2023-10-17 04:12 GMT

CM Jagan: మరింత ఆలస్యంకానున్న సీఎం జగన్ వైజాగ్ షిఫ్టింగ్

CM Jagan: విశాఖ రాజధాని తరలింపు ముహూర్తం డిసెంబర్ కి మారింది. ఆ మధ్య దసరాకల్లా మకాం మార్చేస్తానన్నారు సీఎం జగన్. ఇప్పుడు కొత్త ముహూర్తాన్ని తానే స్వయంగా ప్రకటించారు. ఈ ఏడాది చివరినాటికి విశాఖ నుంచి పాలన మొదలవుతుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు తెరపైకి వచ్చిన తర్వాత.. విశాఖ కేంద్రంగా పాలన సాగించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది అధికార వైసీపీ ప్రభుత్వం.

ముందుగా దసరా నాటికి సీఎం జగన్ విశాఖకు షిఫ్ట్‌ అవుతారనే ప్రచారం సాగింది. అయితే కొన్ని కారణాల రీత్యా అది సాధ్యం కాలేదు.. అయితే, తాను ఎప్పుడు విశాఖకు షిఫ్ట్‌ అవుతాను అనే దానిపై సీఎం జగనే క్లారిటీ ఇచ్చారు. విశాఖలో పర్యటించిన సీఎం.. రుషికొండలో ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా త్వరలోనే విశాఖ నుంచి పాలన అందించనున్నట్టు స్పష్టం చేశారు. మొదట్లో విశాఖ నుంచే పాలన కొనసాగిస్తామన్నారు సీఎం జగన్. పరిపాలనా విభాగంతో పాటు అధికారులు కూడా ఇక్కడికే వస్తారని తెలిపారు.

అయితే సీఎం జగన్ వ్యాఖ్యలతో ఏపీ పాలిటిక్స్ లో అటెన్షన్ క్రియేట్ అయింది. ఇప్పటికే విశాఖలో సీఎంవో, ఇతర కీలక అధికారుల కార్యాలయాలకు అవసరమైన భవనాలు గుర్తించేందుకు ఉన్నతస్థాయి కమిటీ వేశారు. ప్రస్తుతం ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో మౌలికవసతుల ఏర్పాటుపై దృష్టి సారించింది. తొలుత దసరా నుంచే పాలన ప్రారంభించాలని భావించినా.. కమిటీ నివేదిక ఆధారంగా భవనాల లభ్యత చూసుకుని ఒకేసారి విశాఖకు తరలి వెళ్లాలని సీఎం నిర్ణయించారు. దీంతో పనులు పూర్తికాకపోవడమే ప్రధాన కారణమా లేదా సుప్రీంకోర్టులో రాజధాని కేసులు పెండింగ్ లో ఉండటమా అనేది ఇంట్రస్టింగ్ గా మారింది. మొత్తానికి సీఎం చేసిన ప్రకటన మరోసారి రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది.

Tags:    

Similar News