Tirupati Vaikunta Ekadasi: తిరుపతి వైకుంఠ ఏకాదశి భద్రతా ఏర్పాట్లపై సమీక్షా సమావేశం
తిరుపతి ఎస్పీ కార్యాలయంలో వైకుంఠ ఏకాదశిపై సమీక్షా సమావేశం హాజరైన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరామయుడు వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి వచ్చే భక్తులకు,.. ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశామన్న కలెక్టర్, ఎస్పీ
Tirupati Vaikunta Ekadasi: తిరుపతి వైకుంఠ ఏకాదశి భద్రతా ఏర్పాట్లపై సమీక్షా సమావేశం
తిరుపతి ఎస్పీ కార్యాలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు, భద్రతపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరామయుడు హాజరయ్యారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. డిసెంబరు 30, 31, జనవరి 1వతేదీల్లో లక్షా 80వేలమంది భక్తులు దర్శనం చేసుకునే అవకాశం టీటీడీ కల్పించిందన్నారు. ఈ క్రమంలో రద్దీ ఎక్కువగా ఉండబోతుందని.. తిరుపతి బస్టాండ్, రైల్వేస్టేషన్, ప్రధాన కూడళ్లు, స్థానిక ఆలయాల వద్ద భద్రతను రెట్టింపు చేస్తున్నామని.. డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామన్నారు.