Chittoor: 37 ఏళ్ల మహిళ.. 17 ఏళ్ల ప్రియుడు: అత్తను చంపేందుకు అదిరిపోయే స్కెచ్.. సీన్ కట్ చేస్తే ఊహించని ట్విస్ట్!
Chittoor: వివాహేతర సంబంధం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తుందని చెప్పడానికి చిత్తూరులో జరిగిన ఈ ఘటనే నిదర్శనం.
Chittoor: వివాహేతర సంబంధం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తుందని చెప్పడానికి చిత్తూరులో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. తనకంటే 20 ఏళ్లు చిన్నవాడైన ఓ మైనర్ బాలుడి మోజులో పడ్డ ఓ మహిళ, తమ బంధానికి అడ్డుగా ఉన్నారని భర్తను, అత్తను కడతేర్చాలని చూసింది. ప్రియుడిని ఉసిగొల్పి అత్తపై దాడి చేయించిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.
చిత్తూరు నగరం చామంతిపురానికి చెందిన కవిత (37)కు విజయ్‌తో 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, కవిత అదే ప్రాంతంలో ఉండే ఓ 17 ఏళ్ల మైనర్ బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్త విజయ్, అత్త నిర్మలకు తెలియడంతో ఆమెను తీవ్రంగా హెచ్చరించారు. దీంతో వారిని అడ్డు తొలగించుకోవాలని కవిత నిర్ణయించుకుంది.
మ ప్రేమకు అడ్డుగా ఉన్న అత్తను, భర్తను చంపేయాలని కవిత తన మైనర్ ప్రియుడిని రెచ్చగొట్టింది. ఆమె మాటలు నమ్మిన బాలుడు, ఈ నెల 5వ తేదీ రాత్రి నిర్మల ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దాడికి పాల్పడ్డాడు. ఆమె కళ్లల్లో కారం చల్లి, వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోయడానికి ప్రయత్నించాడు. అయితే, బాధితురాలు ప్రాణభయంతో గట్టిగా కేకలు వేస్తూ అతడిని ప్రతిఘటించడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. దీంతో భయపడిన బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
తీవ్ర గాయాలపాలైన నిర్మలను స్థానికులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో కవితా రెడ్డి తనను రెచ్చగొట్టి ఈ పని చేయించిందని బాలుడు అంగీకరించాడు. ప్రస్తుతం ప్రధాన నిందితురాలు కవిత పరారీలో ఉండగా, పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.