బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు నిరసనగా కడపలో ర్యాలీ

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న ఉగ్రదాడులను ఖండిస్తూ విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌ దళ్‌ సంయుక్త ఆధ్వర్యంలో కడపలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

Update: 2025-12-24 10:03 GMT

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు నిరసనగా కడపలో ర్యాలీ

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న ఉగ్రదాడులను ఖండిస్తూ విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌ దళ్‌ సంయుక్త ఆధ్వర్యంలో కడపలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కడప పాత బస్టాండ్‌లోని ఆంజనేయస్వామి ఆలయం నుంచి ఏడురోడ్ల కూడలి వరకు ర్యాలీ కొనసాగింది.

ఈ సందర్భంగా నిరసనకారులు బంగ్లాదేశ్‌ జెండాతో పాటు ఉగ్రవాది దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ‘భారత మాతా కీ జై’, ‘బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదం నశించాలి’ అంటూ నినాదాలు చేస్తూ ప్లేకార్డులు ప్రదర్శించారు.

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో అక్కడి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌ దళ్‌ నేతలు ఆరోపించారు. హిందువులపై దాడులను ఇకపై సహించబోమని హెచ్చరిస్తూ, వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News