NTR District: ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా
NTR District: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కాకానీ నగర్‌లో ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నా చేపట్టింది.
NTR District: ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా
NTR District: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కాకానీ నగర్‌లో ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నా చేపట్టింది. కైకలూరుకు చెందిన వరలక్ష్మి, బాలు సత్యదేవ్‌లు గత ఆరు ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తనను గతంలో సత్యదేవ్ కుటుంబ సభ్యులు కోడలిగా చేసుకుంటానని మాటిచ్చి ముఖం చాటేసారని వరలక్ష్మీ ఆరోపించింది. అడగటానికి వెళ్తే ఇంటికి తాళాలు వేసుకుని వెళ్లిపోయారని తెలిపింది. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వరలక్ష్మీ డిమాండ్ చేసింది.