Nara Lokesh: కోవా బన్ వ్యాపారికి అండగా ఉంటాం -నారా లోకేశ్ భరోసా

మేడారం జాతరలో వేధింపులకు గురైన కోవా బన్ వ్యాపారి వలీకి అండగా ఉంటామని మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ఘటనపై స్పందించి క్షమాపణ తెలిపారు.

Update: 2026-02-15 11:27 GMT

Nara Lokesh: కోవా బన్ వ్యాపారికి అండగా ఉంటాం -నారా లోకేశ్ భరోసా

నారా లోకేశ్ మేడారం జాతరలో చిరు వ్యాపారి వేధింపులకు గురైన ఘటనపై స్పందిస్తూ బాధితుడికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కర్నూలుకు చెందిన వలీ అనే వ్యాపారి కోవా బన్ విక్రయిస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు అడ్డుకుని ఆరోపణలు చేయడం, వేధింపులకు పాల్పడినట్లు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలోకి వచ్చాయి.

తెలంగాణలోని మేడారం జాతర వద్ద జరిగిన ఈ ఘటనపై మంత్రి లోకేశ్ స్పందిస్తూ, బాధితుడికి బహిరంగంగా క్షమాపణ తెలిపారు. విభజనకు దారి తీసే ప్రవర్తనకు తెలుగు సమాజంలో స్థానం లేదని పేర్కొన్నారు. పరస్పర గౌరవం, సామరస్యమే మన సంప్రదాయమని వెల్లడించారు.

త్వరలోనే బాధిత వ్యాపారిని స్వయంగా కలిసి అతని వద్ద కోవా బన్ రుచి చూస్తానని కూడా తెలిపారు. ఈ వ్యాఖ్యలు వెలువడిన తర్వాత సామాజిక వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.



Tags:    

Similar News