Rushikonda Palace: రుషికొండపై కేబినెట్ సబ్ కమిటీ మరోసారి భేటీ
Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్ అంశం మరో సారి హాట్ టాపిక్ గా నిలిచింది.
Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్ అంశం మరో సారి హాట్ టాపిక్ గా నిలిచింది. ఇప్పటికే ఈ అంశంపై ఏపీ సర్కార్ కేబినెట్ సబ్ కమిటీ నియమించింది. మూడు సార్లు సబ్ కమిటీ సమావేశం అయ్యింది. రుషికొండ ప్యాలెస్ వినియోగంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా మరోసారి సచివాలయంలో రుషికొండ అంశంపై సబ్ కమిటీ భేటీ అయ్యింది.
రుషికొండ ప్యాలెస్ వినియోగంలో లేకపోయినా నెలకు 25 లక్షలు విద్యుత్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు భరించాల్సి వస్తుందని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజాభిప్రాయాలు కొరుతూ గత సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.