Visakhapatnam: భార్య అత్తపై సుత్తితో దాడి చేసిన భర్త
భార్య అత్తపై సుత్తితో దాడి చేసిన భర్త అడ్డుకోవడానికి వెళ్లిన వారిపై కూడా దాడి అత్త, కొడలిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలింపు పోలీసుల అదుపులో భర్త అప్పారావు
Visakhapatnam: భార్య అత్తపై సుత్తితో దాడి చేసిన భర్త
భార్య, అత్తపై భర్త సుత్తితో దాడి చేసిన ఘటన విశాఖపట్నంలో కలకలం రేపింది. పెందుర్తి పరిధిలోని దగ్గువానిపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో అప్పారావు అనే వ్యక్తి తన భార్య లక్ష్మి, అత్త కనకమహాలక్ష్మిపై సుత్తితో దాడి చేశాడు.
బాధితుల అరుపులు విని అడ్డుకోవడానికి వచ్చిన స్థానికులపై కూడా అప్పారావు దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కనకమహాలక్ష్మి, లక్ష్మిలను స్థానికులు వెంటనే పెందుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని భర్త అప్పారావును అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.