Visakhapatnam Christmas 2025: విశాఖలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
విశాఖలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు విద్యుత్ అలంకరణతో జిగేల్‌మంటున్న చర్చీలు క్రైస్తవుల ప్రార్థనలతో అంబరాన్నంటిన సంబరాలు జనులంత ప్రేమతత్వంతో ఉండాలని క్రీస్తు సందేశం
Visakhapatnam Christmas 2025: విశాఖలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
క్రిస్మస్ వచ్చిందంటే చాలు క్రైస్తవుల ఇంటి ముందు ఒక తార తళుక్కున మెరుస్తుంది. శాంతక్లాజ్, జంగిల్ బెల్స్, క్రిస్మస్ ట్రీస్, ఆహ్వానం పలుకుతాయి. క్రీస్తు సందేశం ప్రకారం జనులంత ప్రేమతత్వంతో ఉండాలని చెప్తుంది. చర్చీలన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు అయ్యాయి.
క్రిస్మస్ వేడుకలు ప్రారంభం అవ్వగానే చర్చీలలో శాంతి సందేశాలు వినిపిస్తాయి. ఆత్మీయ పలకరింపులు కనిపిస్తాయి. క్రీస్తు జనన సమయంలో ఆకాశంలో ఒక ధృవ తార మెరిసింది అంట. అందుకు ప్రతీకగా క్రిస్మస్ టైములో ప్రతి ఇంటి ముందు కలర్ఫుల్ స్టార్ ఏర్పాటు చేస్తారు. యేసుక్రీస్తు అశోక చెట్టు కింద జననం పొందారు. అందుకోసం క్రిస్మస్ ట్రీ పెడతారు. అప్పట్లో ఉన్న దురాచారాలు రూపుమాపడంతో పాటు ప్రజలందరికీ సమానత్వం, శాంతి స్వభావం కలిగించడం క్రీస్తు సందేశం. అందుకే క్రిస్మస్ వేడుకలు అందరూ కలిసిమెలసి జరుపుకుంటారు.
బైబిల్ సారాంశం ప్రకారం క్రైస్తవం అంటే మతం కాదు సేవాభావం, ప్రేమతత్వం.. అందరు సమానమేనన్న ఆచరణ కోసమే క్రీస్తు జననం జరిగిందంటున్న క్రైస్తవులు. ఇక క్రిస్మస్ సంబరాలకు విశాఖ సిద్ధమైంది. చర్చీలు విద్యుత్ అలంకరణతో జిగేల్ మంటున్నాయి. మరోవైపు నోరు ఊరించే కేకులు సిద్ధం అయ్యాయి. ప్రేయర్స్తో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. మొత్తానికి విశాఖలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.