Zurich Telugu Meet: 20 దేశాల తెలుగు ప్రజలతో సీఎం చంద్రబాబు భేటీ

Zurich Telugu Meet: జ్యూరిచ్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్నార్టీలు వ్యాపారవేత్తలుగా ఎదగాలని, ఏపీలో పెట్టుబడుల అవకాశాలు అపారమని పేర్కొన్నారు.

Update: 2026-01-20 09:28 GMT

Zurich Telugu Meet: జ్యూరిచ్ వేదికగా ఏపీ విజన్ వివరించిన సీఎం చంద్రబాబు

Zurich Telugu Meet : తెలుగు జాతి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే తనకు సంతృప్తిగా ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎన్నార్టీలు ఎదగాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. దావోస్ తొలి రోజు పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు విజయవాడ జ్యూరిచ్‌‎లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొని... స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. 20 దేశాల నుంచి కుటుంబాలతో తరలివచ్చిన తెలుగు ప్రజలను ఆత్మీయంగా పలకరించారు. వినూత్న ఆలోచనతో ముందుకు వస్తే ఎన్నార్టీలు పారిశ్రామికవేత్తలుగా మారడం పెద్ద కష్టం కాదన్నారు చంద్రబాబు.

దావోస్‌కు తొలిసారి వచ్చిన రోజుల్లో జ్యూరిచ్‌లో తెలుగు వాళ్లు కనిపించలేదని గుర్తు చేసిన సీఎం… ఇప్పుడు విజయవాడ, తిరుపతి గుర్తుకు వచ్చేలా పరిస్థితి మారిందన్నారు. విజన్–2020లో ఐటీపై మాట్లాడినప్పుడు విమర్శలు ఎదురయ్యాయని… కానీ అదే విజన్ వల్ల 195 దేశాల్లో తెలుగు వారు స్థిరపడ్డారని తెలిపారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలో నెంబర్–1 ఎకానమీగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌కు బలమైన భవిష్యత్ ఉందన్నారు. యువతకు ప్రాధాన్యం ఇస్తూ లోకేష్, రామ్మోహన్ నాయుడు, టీజీ భరత్ వంటి యువ నేతలకు బాధ్యతలు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు.


ఎన్నికల్లో ఎన్నార్టీలు ఇచ్చిన సహకారాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. కూటమి విజయానికి డయాస్పోరా కీలక పాత్ర పోషించిందన్నారు. 18 నెలల్లోనే రాష్ట్ర బ్రాండ్‌ను తిరిగి నిలబెట్టామని… స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో భారీ పెట్టుబడులు ఆకర్షించామన్నారు. దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే రావడం, గూగుల్, ఆర్సెలార్ మిట్టల్, AM గ్రీన్ వంటి సంస్థల భారీ పెట్టుబడులు అందుకు నిదర్శనమన్నారు. 22 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలిపారు. తెలుగు కుటుంబాలకు సీఎం చంద్రబాబు ప్రత్యేక పిలుపునిచ్చారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుంటే… ఒకరు ఉద్యోగం, మరొకరు వ్యాపారాన్ని కొనసాగించమన్నారు. ఏపీలో వ్యాపారాలకు అపార అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్‌లకు పూర్తి మద్దతు ఇస్తామని... ఒన్ ఫ్యామిలీ – ఒన్ ఎంటర్‌ప్రెన్యూర్ ప్రభుత్వ విధానమని వెల్లడించారు.

విదేశీ విద్యపై కీలక హామీనిచ్చారు సీఎం చంద్రబాబు. చదువుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పిస్తామని... 4 శాతం వడ్డీతో ప్రభుత్వ గ్యారెంటీపై విద్యారుణాలు అందిస్తామన్నారు. తిరుపతిలో IIT - IISER కాంబినేషన్‌తో ఏపీ ఫస్ట్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమం అంతా ఉత్సాహంగా సాగగా… వివిధ దేశాల నుంచి వచ్చిన తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారు. అనంతరంసంక్రాంతి పోటీల విజేతలకు బహుమతులు అందించిన చంద్రబాబు… గోదావరి పుష్కరాలకు రావాలని తెలుగువారిని ఆహ్వానించారు.

Tags:    

Similar News