Tirumala: టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.కోటి విరాళం
Tirumala: తిరుమలలోని శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు గురువారం రూ.కోటి విలువైన విరాళం అందింది.
Tirumala: టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.కోటి విరాళం
Tirumala: తిరుమలలోని శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు గురువారం రూ.కోటి విలువైన విరాళం అందింది. ఈ సందర్భంగా ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో కలిసి సీకేపీసీ ప్రాపర్టీస్ ఎండీ చిరాగ్ పురుషోత్తం ఈ విరాళానికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్‌ను తితిదే చైర్మన్ బీఆర్ నాయుడుకు అందజేశారు.
పేద మరియు ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఉచిత వైద్యం అందించడంలో ఎస్వీ ప్రాణదాన ట్రస్టు కీలక పాత్ర పోషిస్తున్నదని, ఈ ట్రస్టు సేవలు ప్రశంసనీయమని చిరాగ్ పురుషోత్తం కొనియాడారు. ఈ ఔదార్యభరిత సేవల్లో భాగస్వాములమవడం తమకు గర్వకారణమని ఆయన తెలిపారు.
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ ఔదార్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి దాతలు మరింతమంది పేదలకు వెలుగు చూపించే సేవా కార్యక్రమాలకు ప్రేరణగా నిలుస్తారని పేర్కొన్నారు.