హిందీ భాషపై మొన్న పవన్ కళ్యాణ్, ఇవాళ చంద్రబాబు నాయుడు... ఎవరేమన్నారంటే...

Update: 2025-03-17 12:06 GMT

హిందీ భాష వివాదంపై మొన్న పవన్ కళ్యాణ్, ఇవాళ చంద్రబాబు నాయుడు... ఎవరేమన్నారంటే...

Chandrababu Naidu about Hindi Language issue: హిందీ భాషపై ప్రస్తుతం ఒక పెద్ద వివాదం నడుస్తోంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 పేరుతో తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దొద్దని ఆ రాష్ట్ర సీఎం ఎం.కే. స్టాలిన్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా స్టాలిన్ పెద్ద ఉద్యమాన్నే నడిపిస్తున్నారు. ఇదిలావుండగా తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు హిందీ భాష వివాదంపై స్పందించారు.

ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ "భాష అనేది కేవలం సమాచార మార్పిడి కోసం ఉపయోగించే ఒక మాధ్యమం మాత్రమే" అని అన్నారు. " ఇంగ్లీష్ భాషతోనే విజ్ఞానం వస్తుందని ఒక అపోహ ఉంది. కానీ ఒక భాషతోనే విజ్ఞానం రాదు. తను ఆ మాటను అంగీకరించను. ప్రపంచంలో ఎక్కడ చూసినా.. తమ మాతృ భాషలో చదువుకున్న వారే ఎక్కువగా రాణిస్తున్నారు.ఎందుకంటే ఏ విషయమైనా మాతృభాషలో నేర్చుకోవడం ఈజీ అవుతుంది" అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

మరోసారి మీ అందరికీ చాలా స్పష్టంగా చెబుతున్నాను... భాషను ద్వేషించొద్దు. మాతృభాషను కొనసాగిస్తూనే అన్ని భాషలు నేర్చుకోవాలి. హిందీ భాష నేర్చుుకుంటే ఢిల్లీలో మాట్లాడటానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇండియాలోనే జపనీస్, జర్మన్ నేర్చుకుంటే అక్కడికి వెళ్లే వారికి ఉపయోగపడుతుందన్నారు. ఎన్డిఏ కూటమిలో కొనసాగుతున్న చంద్రబాబు నాయుడు తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్రంపై చేస్తోన్న ఆరోపణలకు సమాధానంగానే ఈ వ్యాఖ్యలు చేశారా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అంతకు ముందు పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే...

హిందీ భాష విషయమై మార్చి 15న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఒక భాషను బలవంతంగా ఒకరిపై రుద్దడమో లేక ఒక భాషను గుడ్డిగా విమర్శించడమో చేయడం వల్ల జాతీయ సంస్కృతిక సమగ్రత లక్ష్యం నెరవేరదన్నారు. తను హిందీని ఎప్పుడూ విమర్శించలేదన్నారు. కానీ హిందీ భాషను తప్పనిసరి చేయడాన్ని మాత్రమే తప్పుపట్టాననని చెప్పారు. హిందీ తప్పనిసరి అనే నిబంధన జాతీయ విద్యా విధానం 2020 పాలసీలోనే లేనప్పుడు ఇక ఈ విషయంలో లేనిపోనివి ప్రచారం చేయడం జనాన్ని తప్పుదోవపట్టించడమే అవుతుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి పవన్ కళ్యాణ్ వివరించే ప్రయత్నం చేస్తూ అందులో భాష గురించి ఏముందో చెప్పుకొచ్చారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం విద్యార్థులు మాతృభాషతో కలిపి ఏదైనా రెండు భారతీయ భాషలు నేర్చుకునేందుకు వెసులుబాటు ఉందన్నారు.

ఒకవేళ ఎవరికైనా హిందీ చదవడం ఇష్టం లేకపోతే ఆ స్థానంలో తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, మరాఠి, గుజరాతి, సంస్కృతం, అస్సామీస్, ఒడియా, బెంగాలీ, కశ్మీరీ, పంజాబీ, సింధీ, బోడో, డోగ్రి, కొంకణి, మైథిలి, మైఠీ, నేపాలీ, ఉర్దూ.... ఇలా ఏ భాషనైనా ఎంచుకోవచ్చని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. భాషా స్వేచ్ఛకు, చదువుకునే మాధ్యమానికి జనసేన పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. 

హీందీ భాషతో పాటు కేంద్రంతో స్టాలిన్ విభేదిస్తోన్న మరో అంశం డీలిమిటేషన్. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు అభిప్రాయం ఏంటి?

Full View

Tags:    

Similar News