మార్షల్స్ నన్ను తోసేశారు.. : చంద్రబాబు

Update: 2019-12-12 05:57 GMT

భద్రతా సిబ్బంది తీరుపై అసెంబ్లీలో టీడీపీ నిరసన తెలిపింది. అసెంబ్లీ దగ్గర చంద్రబాబు, ఎమ్మెల్యేలను సెక్యూరిటీ అడ్డుకున్నారని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. నల్లబ్యాడ్జీలు పెట్టుకున్నా అభ్యంతరం చెప్పారని అన్నారు. ప్రతిపక్ష నేత చేయి పట్టుకుని చీఫ్ మార్షల్ లాగేశారని తెలిపారు.

నాలుగో రోజు సభ ప్రారంభం కాగానే ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పేపర్లతో సభలోకి వస్తుండగా మార్షల్స్ తనను బయటికి తోసేశారని ఆరోపించారు. సభ్యుడిగా ఉన్న తనను తోసేసిన మార్షల్‌పై చర్యలు తీసుకోవాలని, సభా మర్యాదలు కాపాడాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇక కావాలని సీఎం జగన్ విమర్శలు చేయడం తగదని, పులివెందుల పంచాయితీ అసెంబ్లీలో పనిచేయదని, అది ఇక్కడ అవసరం లేదని అన్నారు.

Tags:    

Similar News