Telugu Akademi: తెలుగు అకాడమీ కేసులో సంచలన విషయాలు

*రూ.64 కోట్లకు సంబంధించి వివరాలు రాబడుతున్న సీసీఎస్ *9 మంది నిందితులను ప్రశ్నిస్తున్న సీసీఎస్ పోలీసులు

Update: 2021-10-14 05:56 GMT

తెలుగు అకాడమీ కేసులో సంచలన విషయాలు

Telugu Akademi Case: తెలుగు అకాడమీ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కాజేసిన 64 కోట్ల రూపాయలకు సంబంధించి వివరాలను సీసీఎస్ పోలీసులు రాబడుతున్నారు. మొత్తం 9 మంది నిందితులను ప్రశ్నిస్తున్నారు. కస్టడీలో నిందితులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. నిందితులు కొట్టేసిన సొమ్ముతో కొనుగోలు చేసిన ఫ్లాట్ల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

యాక్సిన్, కెనరా బ్యాంక్ మేనేజర్లు సాధన, మస్తాన్‌వలీలు కొనుగోలు చేసిన ఆస్తుల పత్రాలు సీజ్‌ చేశారు. అటు 20 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు సీసీఎస్ పోలీసులు. రాజ్‌కుమార్‌, సాయికుమార్‌, వెంకటరమణ నుంచి లక్షల్లో నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 14 మంది నిందితుల నుంచి 17 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం అయ్యాయి. అలాగే 3 కోట్ల నగదును కూడా సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

Tags:    

Similar News