జగన్ కేసు విషయంలో చంద్రబాబు ఎందుకు తప్పుపడుతున్నారో అర్ధం కావడం లేదు : బీజేపీ

Update: 2019-01-13 11:09 GMT

ప్రధానమంత్రి మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖ టీడీపీ- బీజేపీల మధ్య మాటల యుద్ధాన్ని రాజేసింది. ప్రతిపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకి ఇవ్వడాన్ని ... చంద్రబాబు ఎందుకు తప్పుపడుతున్నారో అర్ధం కావడం లేదని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. అరకు ఎమ్మెల్యే హత్యకేసులో ఎన్ఐఏ విచారణ కోరిన చంద్రబాబు .. జగన్ కేసులో ఎందుకు వద్దంటున్నారని ప్రశ్నించారు. ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం ఉండటం వల్లే .. కేసు విచారణకు అడ్డుపడుతున్నారంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ తీవ్ర స్ధాయి ఆరోపణలు చేశారు. 

చంద్రబాబు నాయుడిపై బీజేపీ ఏపీ ఇంచార్జ్ సునీల్ దేవ్ దర్ తీవ్ర స్ధాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు .. చందాల బాబులా పాలన కోనసాగిస్తున్నారంటూ ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగమన్న చంద్రబాబు .. తన కుమారుడికి తప్ప మరెవ్వరికి ఉద్యోగాలు ఇవ్వలేదంటూ ఆరోపించారు. రైతులు, యువత, మహిళలను మోసం చేసిన ఘనత బాబుదే అన్నారు. నాలుగేళ్లు మోడీని కీర్తించిన బాబు .. ఇప్పుడు రంగులు మార్చి రాహుల్‌ను పొగుడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో రోజుకో మాట పూటకో బాట పట్టడంలో బాబును మించిన నేత మరోకరు లేరంటూ దేవ్ దర్ విమర్శించారు.

Similar News